నా కూతురికి ఆయన వుంటే చాలు..శ్రీజ..!

-

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సినిమా రంగానికి దూరంగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలపరంగా వార్తల్లో నిలుస్తూ వుంటుంది. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ లాగే శ్రీజ జీవితం కూడా మారుతుంది అంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా శ్రీజ వ్యక్తిగత జీవితం గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో అటు శ్రీజ, ఇటు మెగా ఫ్యామిలీ ఎవరు కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్, చిరంజీవి గురించి శ్రీజ చేసిన కామెంట్లు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్.. చిరంజీవి వల్లే తన జీవితం మారిపోయిందని శ్రీజ చెప్పుకొచ్చింది. తన నాన్న చిరంజీవికి బాగా క్లోజ్ అని కూడా ఆమె కామెంట్లు చేసింది. ఇకపోతే తాము ఎక్కడికి వెళ్లినా నవిష్క విషయంలో తమకు ఎలాంటి బెంగ ఉండదు అని కూతురు నవిష్క.. చిరంజీవి, పవన్ పాటలు పాడడం తో పాటు డాన్స్ కూడా చేస్తుందని శ్రీజ చెప్పుకొచ్చింది . ప్రస్తుతం నవిష్క పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఉందని కూడా చెబుతోంది.

తన కూతురుకి తన తండ్రికి మధ్య బాండింగ్ చాలా చక్కగా ఏర్పడింది అని .. తన కూతురికి తాను లేకపోయినా తన తండ్రి చిరంజీవి ఉంటే చాలు అని చెప్పుకొచ్చింది శ్రీజ. మొత్తానికి అయితే తాత – మనవరాలు మధ్య అనుబంధం బాగా పెరిగింది అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అలాగే శ్రీజ కూడా తన భర్త కళ్యాణ్ దేవ్ తో కలిసి పోవాలని కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version