ర‌జ‌నీ కాంత్ సినిమా లు చేయాలంటే న‌ర‌కం- ఏ ఆర్ రెహ‌మాన్

-

ర‌జినీ కాంత్ సినిమాలు చేస్తుంటే.. న‌ర‌కం లా ఉంటుంద‌ని ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏ ఆర్ రెహ‌మాన్ అన్నాడు. ఏ ఆర్ రెహ‌మాన్ తాజాగా ఒక ఇంట‌ర్వ్యూ లో ర‌జినీ కాంత్ సినిమాల గురించి మాట్లాడాడు. ర‌జనీ కాంత్ సినిమాల కు స‌మ‌యం చాలా త‌క్కువ గా ఉంటుంద‌ని అన్నారు. అందు వల్ల త‌క్కువ స‌మ‌యంలో మంచి మ్యూజిక్ ఇవ్వాలంటే చాలా ఒత్తిడి కి గురి అవుతుంద‌ని అన్నారు.

ఆయ‌న సినిమా లు అంటే శాంతి, అహ్లాద‌కర‌మైన వాతావ‌ర‌ణం త‌న‌కు దూరంగా ఉంటాయ‌ని ఏ ఆర్ రెహ‌మాన్ అన్నాడు. అలాగే అప్ప‌ట్లో ర‌జినీ కాంత్ సినిమాలు అన్ని కూడా దీపావ‌ళీ కానుక‌గా విడుద‌ల అయ్యేవ‌ని.. అప్పుడు ఆయ‌న సినిమా ల పాటల తో పాటు బీజేఎం కూడా అదిరి పోయేలా ఉండాల‌ని ఆయ‌న అభిమ‌నులు అనేవార‌ని అన్నారు. దాంతో త‌న పై ఒత్తిడి ఇంకా పెరిగేద‌ని అన్నారు. కాగ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్, ఏ ఆర్ రెహమాన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కలెక్షన్ల పరంగానే కాకుండా మ్యూజికల్ గా మంచి హిట్ ను అందుకున్నాయి. వీరి కాంబినేష‌న్ లో వ‌చ్చిన వాటి లో ముత్తు, శివాజీ, రోబో, రోబో 2.0 ఉన్నాయి. ఈ సినిమాలు అన్ని కూడా మంచి హిట్ అందుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version