మా ర‌క్తంలోనే ఉంది.. రాజకీయాల‌పై సోనూ సుద్ కీల‌క ప్ర‌క‌ట‌న

-

హెల్పింగ్ స్టార్ సోనూ సుద్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌ను త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల‌కు సాయం చేయ‌డం త‌మ కుటుంబ ర‌క్తంలోనే ఉంద‌ని ఆయ‌న అన్నారు. అయితే రాజ‌కీయాల్లోకి ఇప్పుడే రాలేన‌ని అన్నారు. మ‌రో ఐదు సంవ‌త్స‌రాల పాటు ప్ర‌జా సేవ చేసిన త‌ర్వాత ప్ర‌త్యేక్ష రాజ‌కీయాల్లోకి అడుగు పెడుతాన‌ని తెలిపారు. కాగ సోనూ సుద్ సోద‌రి మాళ‌విక సూద్ ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే.

sonu sood
sonu sood

అయితే మాళ‌విక సూద్ వ‌చ్చే నెల‌లో జ‌రగ‌బోయే అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మోగా నియోజ‌క వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేస్తుంది. దీంతో సోనూ సుద్ త‌న సోద‌రిని గెలిపించాలని ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాడు. అయితే నేరుగా కాంగ్రెస్ ఓటు వేయాల‌ని సోనూ సుద్ చేప్ప‌డం లేదు.. కానీ త‌న సోద‌రినీ గెలిపించాల‌ని ఓట‌ర్లు కోరుతున్నాడు. కాగ ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news