బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాజాగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అలంపూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ కానుంది.
ఇక అటు కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక నుండి బీఆర్ఎస్ పార్టీలో యువతకు పెద్దపీట వేయనున్నారట కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఈ ఏడాది జనవరిలో ఉమ్మడి జిల్లాలవారీగా విశ్లేషణ చేపట్టిన గులాబీ దళం.. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లోనూ ఓడి పోవడంపై లోతుగా విశ్లేషణ జరిపింది. పార్టీ నాయకులు, కేడర్ తోపాటు వివిధ సంస్థలు, వర్గాల నుంచి అందిన నివేదికలు, సమాచారాన్ని క్రోడీకరించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొందరు కీలక నేతలతో సారాంశాన్ని పంచుకున్నారు.