ఆ పోస్ట్ చేసింది నేను కాదు.. ప్రముఖ న్యూస్ ఛానల్ పై ఫైర్ అయినా పూనమ్ కౌర్

-

ప్రముఖ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో పలు హిట్ సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉంది. అయితే తాజాగా టాలీవుడ్ న‌టి పూనమ్ కౌర్ తెలుగు దిన ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. త‌న‌పై ఫేక్ వార్త రాసి ఇప్ప‌టివ‌ర‌కు క్షమాపణలు చెప్ప‌లేద‌ని నటి పూనం కౌర్ తెలిపింది. దిశ ఘ‌ట‌న స‌మయంలో నటి పూనమ్ కౌర్ ట్విట్ చేసిన‌ట్లు ఒక వార్తను ఆంధ్ర‌జ్యోతి వెబ్‌సైట్ ప్రచురించింది.ఇందులో దిశ‌కు న్యాయం చేసినందుకు తెలంగాణ ప్ర‌భుత్వానికి పోలీసుల‌కు థ్యాంక్స్. అంతే కాకుండా నాతోపాటు ప‌లువురు మ‌హిళ‌ల‌ను మోసం చేసిన కొంత‌మంది సినీ అలియాస్ రాజ‌కీయ నాయ‌కుల‌ను శిక్షిస్తారని భావిస్తున్నాను అని,ప్లీజ్ రెండు బెత్తం దెబ్బ‌లు అంటూ ఆంధ్ర‌జ్యోతి న్యూస్ పేపర్ ప్రచురించింది.

అయితే ఈ పోస్ట్ చేసింది నేను కాద‌ని పూనమ్ కౌర్ పేర్కొంది. ఈ విషయాన్ని ప్ర‌స్తావిస్తూ.. నాపై తప్పుడు వార్త ప్రచురించిన ఆంధ్ర‌జ్యోతి ఇప్పటి వరకు క్షమాపణలు చెప్ప‌డం కాదు కదా.. క‌నీసం స్పష్టత కూడా ఇవ్వలేదు అని వెల్లడించింది.ఒకరి అజెండాలను మరొకరి భుజం మీద రుద్దడం సరి కావచ్చు. వీళ్లు స్పందిస్తారని నేను అనుకోట్లేదు అని కానీ నేను ప్రజలను నమ్మవద్దని నేను గుర్తు చేస్తున్నాను అని అలాగే వాళ్లు నన్ను ఇప్పటివరకు వెంటాడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో రాసుకోచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version