గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది.. జైలుకి పోయే లిస్టులో మొదటి వ్యక్తి నువ్వే : ఎమ్మెల్యే కోమటిరెడ్డి

-

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి,మాజీ మంత్రులు గంగుల కమలాకర్,మల్లారెడ్డి,ప్రశాంత్ రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారితో మాట్లాడుతూ.. గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయిందని ..ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ మంత్రి జైలు పోయే లిస్టులో మొదటి వ్యక్తి అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారితో అన్నారు.

తాము ఎమ్మెల్యేలను కొనలేమని,కేసీఆర్ మాత్రం రూ.20, 30 కోట్లు ఇచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారని మండిపడ్డారు.తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.5, 10కి మాత్రమే అడుగుతున్నామని ,అందుకే ఇంకా 26 ఎమ్మెల్యేలు తమ దగ్గరికి రాలేదని అన్నారు. రూ.300 కోట్లు ఖర్చు పెట్టి మునుగోడు ఉపఎన్నికలో గెలిచారని.. కర్ణుడిని ఒడించినట్లు ఓడించారని ఆయన అన్నారు.మునుగోడు ఉపఎన్నిక ఫలితం బీఆర్ఎస్‌పై పడడం కారణంగానే కేసీఆర్ అధికారం కోల్పోయారన్నారు. తాను మంత్రి పదవి కోసం పైరవీలు చేయనని.. అయ్యేది ఉంటే ముఖ్యమంత్రి కావొచ్చని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version