బీజింగ్: ఇప్పుడంతా ఆన్‌లైన్ మాయాజాలం నడుస్తోంది. చిత్రవిచిత్రమైన కాంటెంట్ ను పోస్ట్ చేస్తూ క్షణాల్లో తమ అకౌంట్లోకి డబ్బులు వచ్చేలా చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లపై రకరకాల వీడియోలు చేస్తూ తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదిస్తున్నారు. అలాగే చైనాకు చెందిన జెంగ్ జియాంగ్ జియాంగ్ అనే మహిళ వీడియోలు చేస్తూ కోట్లు కోట్లు సంపాదిస్తోంది. ఆమెకు టిక్‌టాక్ లాంటి డోయున్ యాప్‌లో ఆమెకు 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఆమె చేసే వీడియోలు అందర్నీ అట్రాక్ట్ చేస్తూ, వివిధ రకాల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుంది. ఆమె ఎటువంటి ప్రోడక్ట్ అయినా మూడు సెకండ్లలో ప్రమోట్ చేస్తుంది. రకరకాల ఉత్పత్తులను క్షణాల్లోనే తన వీడియోలో చూపిస్తుంది.యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో ఫాలోవర్లను పెంచుకుంటూ దండిగా ఆర్జిస్తున్నారు. జెంగ్ ప్రతివారం సుమారు 120 కోట్లు సంపాదిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.ఆమె ప్రమోషన్ టెక్నిక్‌తో ఉత్పత్తులు కూడా చాలా వేగంగా అమ్ముడుపోతున్నట్లు తెలుస్తోంది.