Italy: సాంగ్ షూట్లో ప్రభాస్, దిశా పటాని… స్టిల్ బాగుందంటు ఫ్యాన్స్ కామెంట్స్

-

మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ . సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో వస్తోన్న ఈ సినిమాని మే 9 న 2024లో రిలీజ్ కానుంది.వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో వచ్చి ట్రెండ్‌ సెట్టర్స్‌గా నిలిచిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి చిత్రాలు మే 9 న రిలీజైన సంగతి తెలిసిందే.ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మూవీ మేకర్స్ అందిస్తున్నారు. ఇటీవల సాంగ్ షూట్ కోసం బృందం ఇటలీ వెళ్తున్న ఫొటోను పంచుకున్నారు. తాజాగా సాంగ్ షూటింగ్లో ప్రభాస్, దిశా పటాని స్టిల్ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ లుక్ అదిరిందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news