నితిన్ సినిమాలో “ఊర్వశీ రౌతేలా” ఐటెం సాంగ్

-

టాలీవుడ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో నితిన్. ప్రస్తుతం హీరో నితిన్‌ “మాచర్ల నియోజకవర్గం” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ను శేఖర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి నటిస్తుండగా.. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై తెరకెక్కుతోంది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ కోసం చిత్ర బృందం ఏకంగా బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలాను రంగంలోకి దింపబోతున్నారని టాక్‌ వినిపిస్తుంది. అయితే… దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

దీనిపై బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలాని ఇప్పటికే చిత్ర బృందం సంప్రదించిందట. ఇక ఈ ఆఫర్‌ కు ఊర్వశి రౌతేలాను కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని టాక్‌. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్‌ ఉంది. కాగా.. “మాచర్ల నియోజకవర్గం” సినిమాకు మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version