పేరుకే సెలబ్రిటీ గేమ్ షో.. కానీ నష్టాల బాట పయనం..!!

-

బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతి షోకి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇతర చానల్స్ తో పోలిస్తే ఈటీవీకి మరి కొంచెం ప్రత్యేకత అధికంగా ఉంటుంది . ఎందుకంటే ఈ ఈటీవీ ఛానల్ గత రెండు దశాబ్దాలుగా ఎంతో అద్భుతమైన రేటింగ్ ను కైవసం చేసుకుని ముందుకు దూసుకువెళ్తోంది. ఇకపోతే ఒకానొక సమయంలో ఈ ఛానల్ రేటింగ్ పూర్తిగా పడిపోయినప్పుడు.. నిర్వాహకులు జబర్దస్త్ కార్యక్రమం వంటి కామెడీ షో ద్వారా తిరిగి తమ ఛానల్ ను నిలబెట్టుకోగలిగారు. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ జోడి, క్యాష్ వంటి ప్రోగ్రాములు మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి.

ఇక ఇలా ఎన్నో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను ప్రసారం చేయడంతో ఈటీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ చూడడానికి కూడా ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈటీవీ ఛానల్ ను కొనసాగిస్తున్నప్పటికీ ఈ ఛానల్ లో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాల ద్వారా భారీగానే లాభం పొందుతున్నట్లు సమాచారం. కానీ ఈటీవీలో ప్రసారమయ్యే ఒక కార్యక్రమం మాత్రం పూర్తిగా నష్టాల బాట పట్టిందట. అంతేకాదు ఈ కార్యక్రమం నుంచి ఒక్క రూపాయి కూడా లాభం రావట్లేదని నిర్వాహకులు వాపోతున్నారు. ఆ ప్రోగ్రాం ఏది అనే విషయానికి వస్తే సాయికుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న వావ్ కార్యక్రమం..

ప్రస్తుతం మూడవ సీజన్ ను జరుపుకుంటున్న ఈ కార్యక్రమం తాజాగా నష్టాలబాట పట్టింది. అయితే నష్టాలతో ప్రసారం చేయడానికి కారణం కేవలం సాయికుమార్ తో ఈటీవీ వాళ్లకున్న అనుబంధమేనని.. అంతకుమించి ఈ కార్యక్రమం ద్వారా వారికి ఎటువంటి ప్రయోజనం లేదు అని కూడా తెలుస్తోంది. ఇక మరొకవైపు ఎలాంటి ప్రయోజనం లేని కార్యక్రమాలను ప్రసారం చేసే బదులు ఏదైనా ఎంటర్టైనింగ్ షో చేస్తే లాభాలతో పాటు టిఆర్పి రేటింగ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని ఆలోచనలో మల్లెమాల సంస్థ ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news