J.R. ఎన్టీఆర్ రాజకీయాలలో ఎదగడం వారికి ఇష్టం లేదా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా ఉండే ఈయన.. ఏదైనా సందర్భానుసారం కచ్చితంగా స్పందించాలి అనుకుంటే స్పందిస్తూ ఉంటారు.. అది కూడా కొన్ని విషయాలలో మాత్రమే స్పందిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చడం జరిగింది. వీటిపై కూడా ఎన్టీఆర్ ఇప్పటికే స్పందించడం జరిగింది. అయితే ఎన్టీఆర్ స్పందన పై పలు రకాలుగా కామెంట్ లు చేస్తూ ఉన్నారు రాజకీయ నేతలు.

కానీ మరికొంతమంది ఎన్టీఆర్ చాలా హుందాగా తన స్పందనను తెలిపారని మరికొంతమంది విశ్లేషకులు తెలియజేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ పై వస్తున్న ట్రోల్స్ వెనక కొంతమంది రాజకీయ నాయకుల హస్తం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం కొంతమంది పార్టీ నేతలకు అసలు ఇష్టం లేదని, అందుచేతనే ఎన్టీఆర్ ఏం చేసినా.. ఏం చెప్పినా కూడా తప్పుగానే ప్రచురిస్తున్నారని ఎన్టీఆర్ సన్నిహితుల దగ్గర నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అందుచేతనే ఎన్టీఆర్ కూడా ఎక్కువగా సినిమాలపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ప్రతి సినిమాకు తన క్రేజ్ ను అమాంతం పెంచుకుంటూ వెళ్తున్నారు.

రాబోయే రోజులలో ఎన్టీఆర్ తన విజయాలతో రికార్డులను సైతం క్రియేట్ చేస్తారని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ నటించిన గత సినిమాలన్నీ ఎక్కువగా సక్సెస్ సాధించడంతో రెమ్యూనరేషన్ విషయంలో కూడా బాగానే తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కథల ఎంపికలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఇక ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాని చేయబోతున్నారు. అయితే ఎన్టీఆర్ నటించబోయే చిత్రాలు అన్ని పాన్ ఇండియా చిత్రాలే కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version