జబర్దస్త్ వినోదినిపై దాడి.. తీవ్రంగా గాయాలు..! వీడియో

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలలో లేడీ గెటప్‌లంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వినోద్.. అలియాస్ వినోదిని.. బయట ఏమోగానీ మనకు అతను వినోదినిగానే తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో వినోదిని మనకు ఈ షోలలో కనిపించడం తగ్గింది. ఇక అందుకు కారణాలు ఏమిటో మనకు తెలియదు కానీ.. వినోద్‌ను ఇవాళ ఓ వ్యక్తి తీవ్రంగా గాయపరిచాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

Jabardasth Comedian vinodini severely injured

హైదరాబాద్‌లోని కుత్బిగూడలో ఓ ఇంట్లో వినోద్ అద్దెకు ఉంటున్నాడు. కాగా ఈ రోజు అతని ఇంటి ఓనర్ అతనిపై హత్యాయత్నం చేశాడు. ఈ మేరకు వినోద్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. వినోద్ కంటి భాగంలో తీవ్రంగా గాయమైనట్లు మనకు ఫొటోల ద్వారా తెలుస్తోంది.

Jabardasth Comedian vinodini severely injured

అయితే అసలు వినోద్‌పై అతని ఇంటి ఓనర్ ఎందుకు దాడి చేశాడనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. కానీ.. వినోద్‌కు, అతని ఇంటి ఓనర్‌కు మధ్య ఏవో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, వాటి విషయంలోనే ఇద్దరి మధ్యా గొడవ జరిగిందని, అందుకే ఆ ఓనర్ వినోద్‌పై దాడి చేసి ఉంటాడని తెలుస్తోంది.