బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వనున్న జబర్దస్త్ ఫైమా ..క్లారిటీ ఇదే..!!

-

పటాస్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ఫైమా జబర్దస్త్ ద్వారా లేడీ కమెడియన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది . నిజానికి ఈమె చేసే ఏ కామెడీ స్కిట్ అయినా సరే ఇట్టే ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సిందే. ఇక ఇటీవల జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ టీంలో చేరిన ఫైమా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. ఇక ఫైమా లేని స్కిట్ చూడడానికి కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు అంటే ఆమె ఎంతలా పాపులారిటీని సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా కేవలం బుల్లితెర మీదనే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ ఫైమా త్వరలోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతోంది అనే వార్త వైరల్ గా మారింది. ఇకపోతే ఇప్పటికే చాలామంది బుల్లితెరపై సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించుకొని బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటుంటే ఈ క్రమంలోనే ఫైమాకి కూడా అవకాశం వచ్చింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే బుల్లెట్ భాస్కర్ తో సమానంగా పారితోషకం తీసుకుంటున్న ఫైమా జబర్దస్త్ విడిచి బిగ్ బాస్ లోకి వెళ్ళదు అని కొంతమంది చెబుతుంటే.. మరికొంతమంది జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఫైమా చేస్తోంది అక్కడ కూడా బాగానే సంపాదిస్తోంది ..ఈ టైంలో ఆమె ఎందుకు బిగ్బాస్లోకి వెళ్తుంది అంటూ మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.అయితే ఇప్పటికే జబర్దస్త్ నుండి చంటి జబర్దస్త్ కి వెళ్లడానికి కన్ఫర్మ్ చేసుకున్నాడు. మరి ఫైమా బిగ్ బాస్ లోకి వెళ్తుందో లేదో తెలియాలి అంటే సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version