బీఆర్ఎస్‌కు సవాల్ విసిరిన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే …..దమ్ముంటే ఒక్క ఎంపీ సీటు అయిన గెలవండి

-

మరికొన్ని నెలల్లో తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి . ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంచలన సవాల్ విసిరారు. దమ్ముంటే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానామైన గెలిచి చూపించాలని బీఆర్ఎస్‌కు ఛాలెంజ్ విసిరారు .

ఈరోజు ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మేడిగడ్డ బ్యారేజీని నాశనం చేసి.. మళ్లీ అదే ప్రాజెక్టును బీఆర్ఎస్ నేతలు సందర్శిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణ పనులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు, ఇప్పుడు ఆ ప్రాజెక్టు నీళ్లు ఎక్కడి వరకు వస్తున్నాయో చూసి రావాలని సూచించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని.. లోక్ సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి మళ్లీ అదే పరిస్థితి తప్పదని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news