వడ్లు ఎలా పండుతాయో తెలియని మూర్ఖుడు : బండి సంజయ్ పై జగదీశ్వర్ రెడ్డి ఫైర్

-

తెలంగాణ రైతుల విషయంలో.. కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర బిజెపి నాయకులు నాటకాలు ఆడుతున్నారని ఫైరయ్యారు తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. వడ్లు ఎలా పండుతాయి తెలియని మూర్ఖులు బండి సంజయ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి.

తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్ రైతుల పట్ల బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వరి ధాన్యం కొనలేమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే… వరి తప్ప మరేదీ వేయవద్దని తెలంగాణ బిజెపి నేతలు రైతులు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుందని…  బీజేపీ నాటకాలు అడుతుందని ఘాటుగా విమర్శించారు. బండి సంజయ్ తలతిక్క మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయమని స్పష్టంగా చెబుతుంటే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం యాసంగిలో వడ్లను సాగు చేయాలని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version