హైకోర్టు పంచాయతీ ఎన్నికలకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ రాజధాని విషయం నుండి కొద్దిగా దాని వైపుకి మళ్ళింది. ఒకపక్క ప్రతిపక్షాలు రాజధానిని అడ్డంపెట్టుకుని ఈ ఎన్నికల్లో ఆయా చోట్ల వద్ద భారీగా లాభపడదాం అనుకుంటున్న నేపథ్యంలో జగన్ మాత్రం తనదైన శైలిలో అస్త్రాల తో బరిలోకి దిగుతున్నాడు.
రాష్ట్రంలో గతేడాది 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. 16,207 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం (జనవరి 10) నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో 14,061 గ్రామ సచివాలయ పోస్టులు ఉండగా.. 2,146 వార్డు సచివాలయ పోస్టులు ఉన్నాయి.
అలాగే రాజధాని తరలింపులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క ఉద్యోగికి 200 గజాల స్థలం కేటాయింపు ప్రతిపాదనలను హై పవర్ కమిటీ చేసినట్టు తెలుస్తోంది. కేవలం స్థలమే కాకుండా, ఉచిత నివాస వసతి, కుటుంబంతో సహా తరలి వస్తే.. నెలకు రూ.4 వేల చొప్పున రాయితీ అద్దె చెల్లించాలని ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది.
వారానికి ఐదు రోజుల పనిదినాల కొనసాగింపు, ఉద్యోగులకు తక్షణం వేతన సవరణ, 30 శాతం హెచ్ఆర్ఏ, 10శాతం సీసీఏ, ఇంటి సామాన్ల తరలింపు కోసం హోదా బట్టి లక్ష నుంచి 50 వేలు అందజేయాలని హైపవర్ కమిటీ ప్రతిపాదనను జగన్ సరైన సమయంలో అమలు చేసేందుకు చూస్తున్నారట.
జగన్ తీసుకుంటున్న పై నిర్ణయాల పవర్ అంతా ఇంతా కాదు. జగన్ చేయడంలో కనుక సఫలీకృతుడు అయితే ఓట్లు ఫ్యాన్ గుర్తు పైకి భారీగా రాలుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.