తాను నమ్మిన, తనను నమ్మిన ప్రజలపై జగన్ శ్రద్ధ ఇది!

-

ఒకపక్క కరోనా కష్ట కాలం.. మరో పక్క పూర్తిగా ఆగిపోయిన రాష్ట్ర ఆదాయం.. మరోపక్క కొత్తగా వచ్చి చేరుతున్న కరోనా ఖర్చులు.. అనుకోకుండా వస్తోన్న ఆపదలు.. మరోపక్క కేంద్రం నుంచి అందని సాయం.. ఇన్ని సమస్యలు చుట్టుముడుతున్నా… ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు ఆగడం లేదు! దేశంలో ఎన్నో రాష్ట్రాలు చాలా సంక్షేమ పథకాలకు పరిపూర్ణమైన కోతలు విదిల్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి! కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడంతో మొదలు పెట్టిన కొన్ని రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడో పడకేశాయి! కానీ… ఏపీలో ఏదీ ఆగడం లేదు.. ఇదెలా సాధ్యం అవుతుంది?

ప్రజాసేవపై పరిపూర్ణమైన చిత్తశుద్ధి.. ప్రజా సమస్యల పరిష్కారాలపై పూర్తి పట్టు.. సామాన్యుడి జీవన విధానంపై పూర్తి అవగాహన.. ఉన్నప్పుడు ఏ నాయకుడికైనా ఇది సాధ్యమే అనుకోవాలేమో అన్నట్లుగా సాగుతుంది ఏపీలో జగన్ పాలన! మొన్న ఫీజు రీయెంబర్స్ మెంటు, అనంతరం డ్వాక్రా రుణాలు, తర్వాత రైతు భరోసా… ఇలా సంక్షేమపథకాల అమలులో దూసుకుపోతున్న జగన్… తాజాగా విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు! అవును… ఖరీఫ్‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల వద్ద విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రంలో 8 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనాలను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. ఖరీఫ్‌ పంటకు 5,07,599 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సచివాలయాల్లో సిద్ధంగా ఉంచారు.

ఇదే క్రమంలో తాజాగా సీఎం ఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సొంత ఆటో, ట్యాక్సీ ఉన్న డ్రైవర్లకు “వాహనమిత్ర” పథకం ద్వారా రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకం అందజేయడానికి సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో జూన్‌ 4న రెండో ఏడాది వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర ఆర్థికసాయం విడుదల చేస్తామని మంత్రి పేర్ని నాని తాజాగా స్పష్టంచేశారు. ఈసారి కొత్తగా ఎవరైనా ఆటో, ట్యాక్సీ కొనుగోలు చేసుంటే ఈ నెల 26వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చు! అనంతరం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా మొదలవబోతోంది!

ఇలా… తాను ఇచ్చిన హామీలను అన్నింటినీ జగన్ తూచా తప్పకుండా అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా అర్హులందరికీ అందజేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇలాంటి సమయాల్లో ఎలాంటి సాకులూ చెప్పకుండా… ఆత్మవంచన చేసుకోకుండా… తాను నమ్మిన, తనను నమ్మిన ప్రజలను వంచించకుండా… జగన్ చేస్తున్న ఈస్థాయి పరిపాలనపై ప్రతిపక్షాలను సైతం నోరు మెదపనివ్వకపోవడం గమనార్హం!!

Read more RELATED
Recommended to you

Latest news