గణనాథుడికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి సంబరాలు జరిగాయి. వినాయక చవితి సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

ఈ సందర్బంగా గణనాథుడికి స్వయంగా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు జగన్. విజయవాడలో భారీ వర్షంగా విజయవాడ రాణిగారితోట జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు. ఇక అటు వినాయక చవితి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో కుటుంబ సమేతంగా గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
బ్రేకింగ్ న్యూస్
తాడేపల్లి @YSRCParty కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి సంబరాలు
గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సీఎం @ysjagan
విజయవాడలో భారీ వర్షంగా విజయవాడ రాణిగారితోట పర్యటన రద్దు pic.twitter.com/FgoPbP6u1I
— Telugu Feed (@Telugufeedsite) August 27, 2025