ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాలను కూడా ఖరారు చేసిన తర్వాత షాక్ తిన్నవారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. చిరంజీవి రాజ్యసభకు వెళ్లాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే ఆయన ఏ పార్టీ నుంచి వెళ్లాలి అనుకున్న అనేది మాత్రం చాలామందికి స్పష్టత రాలేదు. ముందు ఆయన బీజేపీ నుంచి జగన్ ద్వారా రాజ్యసభకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. అంటే బిజేపీ లో జాయిన్ అయిన వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నాలుచేసినట్లు సమాచారం.
ఎన్డీఏకి జగన్ రెండు స్థానాలు ఇస్తే అందులో ఒక స్థానం తనకు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని, హోంమంత్రి అమిత్ షా ఆయన కోరారు సైరా సినిమాను మోడీకి చూపించడానికి వెళ్లినప్పుడు ఈ ప్రతిపాదన మోడీ ముందు పెట్టినట్టు సమాచారం. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా చిరంజీవి ఈ విషయంలో బీజేపీ అంతగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. అయితే ఆ తర్వాత చిరంజీవి మళ్ళీ వైయస్ జగన్ ని కలిసి తాను వైసీపీలో చేరతానని తనకు రాజ్యసభ సీటు కావాలని కూడా చిరంజీవి అడిగారని వార్తలు వచ్చాయి.
మరి ఏమైందో జగన్ కూడా చిరంజీవిని పార్టీలోకి తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో టచ్ లోనే ఉన్నారు కాబట్టి తనకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని చిరంజీవిని జగన్ నమ్మ లేదట. వాస్తవానికి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి స్థానంలో చిరంజీవి ని పంపించే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ జగన్ చిరంజీవి నమ్మకు పోవడంతో ఆయనను పక్కన పెట్టారు అంటూ ప్రచారం జరుగుతోంది.