తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌కు సీఎం వైఎస్ జగన్ సవాల్ విసిరారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో పోటీ చేయాలి.. 175 స్థానాల్లో పోటీచేసి గెలిచే ధైర్యం ఉందా? అంటూ ఓ రేంజ్ లో సవాల్ చేశారు సీఎం వైఎస్ జగన్. వరుసగా నాల్గో ఏడాది రైతు భరోసా నిధులు విడుదల చేసిన జగన్.. పంట నష్టపోయిన రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ కూడా వేశారు.
వ్యవసాయం మీద ప్రేమంటే ఇది.. రైతులకు ఏటా రూ.13,500 చెల్లిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు సీఎం జగన్. నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.54 వేలు అందించామని వివరించారు సీఎం వైఎస్ జగన్. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని విమర్శలు చేశారు సీఎం జగన్. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు కచ్చితంగా వస్తుంది… గతం లో వైఎస్సార్ పాలన లో కుడాసమృద్ది గా వర్షాలు పడేవి… రైతులు సుభిక్షం గా ఉన్నారన్నారు. మంచి మనసు తో పరిపాలన చేస్తే దేవుడు కూడా కరుణిస్తాడు…కుప్పం తో సహా రాష్ట్రం లో అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు.