ఇండస్ట్రీలో నాగార్జున మాత్రమే దేవుడు అంటున్న మమతా మోహన్దాస్..!

-

యమదొంగ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మమతా మోహన్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కృష్ణార్జున, విక్టరీ, కథానాయకుడు, చింతకాయల రవి తదితర చిత్రాలలో నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈమె చివరిగా తెలుగులో నాగార్జున సరసన కేడి సినిమాలో నటించినది. ఆ తర్వాత రెండు సార్లు క్యాన్సర్ బారిన పడిన ఈమె.. తరువాత ధైర్యంగా ఆ ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కొని ఇప్పుడు మళ్లీ బొల్లి వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మమత మోహన్ దాస్ నాగార్జున పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మమతా మోహన్దాస్ మాట్లాడుతూ.. నాకు నాగార్జున కేడి సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇవ్వాలనుకున్నారు. కానీ ఆఫర్ ఇచ్చే సమయానికి క్యాన్సర్ వచ్చింది . కేడి సినిమా కోసం నాగార్జున సార్ ఏకంగా నాకు ఫోన్ చేశారు.. అప్పుడే నాకు క్యాన్సర్ ఉందని చెప్పి సినిమాలు చేయలేనని చెప్పాను. వారం తర్వాత నాగార్జున గారు మళ్లీ ఫోన్ చేసి బాల్యంలో ఉండే సన్నివేశాలు మాత్రమే పూర్తి చేస్తాను.. మిగతా సన్నివేశాలకు కలిసి పనిచేద్దామని అన్నారు.

నాకోసం ఒక డైరెక్టర్ ,నిర్మాత మరియు నాగార్జున గారు ఏకంగా 6 నెలల పాటు ఉండే షూటింగు ను నా కోసం. నా కీమో సిట్టింగ్స్ కి ఇబ్బంది కలగకుండా నాలుగు రోజులు మాత్రమే పని చేసే విధంగా షెడ్యూల్ ని మార్చారు. కేవలం ఒక్క హీరోయిన్ కోసం నాగార్జున లాంటి స్టార్ హీరోలు అలా చేయడం ఆయన గొప్పతనం.. ఒకరకంగా చెప్పాలి అంటే ఇండస్ట్రీలో హీరోయిన్ల సమస్యలను అర్థం చేసుకునే ఒకే ఒక్క మగాడు నాగార్జున గారు మాత్రమే అని మోమాతా మోహన్దాస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version