ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలో ఉన్న వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసిన సీఎం రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు ముందు ఉండాలని ఆకాంక్షించారు. మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఆయన అన్నారు. మహిళల కోసమే అమ్మఒడి, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, నాడు – నేడు అనే పథకాలు ప్రవేశ పెట్టామని ఆయన అన్నారు. కేవలం అమ్మఒడి ద్వారా దాదాపు 13 వేల 22 కోట్లు మహిళలకు అందజేశామని అన్నారు.
ఇక వైయస్సార్ ఆసరా పథకం ద్వారా 6,792 కోట్లు అందజేశామని ఆయన అన్నారు. ఇక వైయస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగు వేల ఆరు వందలు నాలుగు కోట్ల రూపాయలు అందజేశామని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన ఇరవై ఒక్క నెలలోనే మహిళల కోసం 80 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా మహిళలు వంటగదికే పరిమితం కాకూడదనే ఉద్దేశంతోనే అన్ని పదవులలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని ఆయన అన్నారు. ఇక ఈ ఏడాది దేశంలోనే ప్రప్రథమంగా జెండర్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని ఆయన అన్నారు.