రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రమేష్ కుమార్ ని తప్పించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయనను ఎలా అయినా సరే రాష్ట్రంలో ఉండకుండా చూడాలని భావిస్తున్న జగన్ ఆయన్ను కట్టడి చేయడానికి గాను ఇప్పుడు తప్పించే అవకాశాలు ఉన్నాయని ఇందుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
రమేష్ కుమార్ ని తప్పించాలి అంటే కచ్చితంగా గవర్నర్ అనుమతి ఉండాలి. ఆయన గవర్నర్ పరిధిలోని వ్యక్తి. గవర్నర్ నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి ఆర్డినెన్స్ ఇవ్వాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ కి ఆ అవకాశం లేదు అనే చెప్పాలి. రమేష్ కుమార్ కేంద్రానికి లేఖ రాసారు కాబట్టి, తనకు భద్రత లేదు అని చెప్పారు కాబట్టి, అవసరం లేదు అనుకుంటే రాష్ట్రం నుంచి వెళ్లిపోవచ్చని ఆయనకు వ్యతిరేకంగా శాసన సభలో తీర్మానం చేయవచ్చు.
ఆ తీర్మానం ఆమోదం పొందాలంటే సభలో మూడింట రెండొంతుల మంది సభ్యులు హాజరుకావాలి. అదే స్థాయిలో సభ్యుల ఆమోదం పొందాలి. ఆ తర్వాత ఆ తీర్మానం గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, అక్కడి నుంచి రాష్ట్రపతికి వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకున్న తర్వాత రాష్ట్రపతి ఈ విషయంలో నిర్ణయ౦ తీసుకుంటారు. అయితే శాసన మండలిలో జగన్ కి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది.
గతంలోనే రెండు బిల్లులు శాసనమండలి నుంచి సెలక్ట్ కమిటీకి వెళ్లాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అయితే శాసన మండలిలో టీడీపీకి అంత బలం ఇప్పుడు ఉండకపోవచ్చు కాబట్టి అది మద్దతు పొందే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. మండలిలో బిల్లు పాస్ అయితే మాత్రం జగన్ ఈ విషయంలో ముందుకి వెళ్ళడం దాదాపుగా ఖాయంగా కనపడుతుంది.