వైసిపి పార్టీ అధినేత జగన్ చేపట్టిన ఢిల్లీ పర్యటన వైసీపీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవల మోడీ తో జగన్ ఢిల్లీలో భేటీ కావడం జరిగింది. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి మరియు అదే విధంగా నిధులకు సంబంధించి కేంద్రం ఆదుకోవాలని మోడీకి జగన్ సూచించడం మనకందరికీ తెలిసినదే. అయితే ఈ తరుణంలో ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో బిజెపి పార్టీ వరుసగా ఓటమి చెందటం తో బిజెపి పార్టీ ఇటీవల కొద్దిగా తగ్గినట్లు అర్థం అవుతోంది.
విషయంలోకి వెళితే దేశ రాజకీయాల్లోనే వైయస్ జగన్ కి అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ ఇటీవల ఏర్పడింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ప్రజలకు చేస్తున్న మంచి పనులలో దేశం మొత్తం మీద మూడో ర్యాంక్ మంచి ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇటువంటి సమయంలో మోడీ ఎన్డీఏ లోకి రావాలని జగన్ ని ఆహ్వానం కోరటం ఇప్పుడు వైసీపీ పార్టీలో పెద్ద చిచ్చుపెట్టి నట్లయింది.
విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి చేస్తే కచ్చితంగా ఎన్డీఏ లోకి రావటానికి మాకు పెద్ద ప్రాబ్లం లేదని జగన్ అన్నట్లు వార్తలు రావటం జరిగాయి. దీంతో వైసీపీ పార్టీకి చెందిన మైనార్టీ నాయకుడు మరియు అదే పార్టీకి చెందిన మంత్రి తో ఈ విషయంలో తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు పార్టీలో వినబడుతున్న ఇన్ సైడ్ టాక్.