Telangana: సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలు..వీడియో వైరల్ !

-

Telangana: సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలు అయ్యాయి అంటూ ఓ వీడియో వైరల్ గా మారింది. అర కిలోమీటర్ పొడవునా జాతీయ రహదారి పక్కన దర్శనం ఇచ్చాయి.. సమగ్రకుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలయ్యాయి. జాతీయ రహదారి పొడవునా ఫారాలు దర్శనమిచ్చాయి.

Comprehensive family survey forms were displayed along National Highway 44 on Thursday evening

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్- నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు 44వ జాతీయ రహదారి పొడవునా గురువారం సాయంత్రం సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు దర్శమిచ్చాయి.

ఈ విషయంపై సమాచారం అందుకున్న మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటీనా సర్వే ఫారాలు పడిన చోటుకు సిబ్బందితో కలిసి వెళ్లారు. అన్ని ఫారాలను సేకరించి, తన వాహనంలో కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version