అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అదేమంటే రాష్ట్రవ్యాప్తంగా మార్చి 7న క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అంతే కాక దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్‌తో 2000 స్టాండ్‌లు ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాక దిశయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేవారికి, ఎంపిక చేసిన షాపింగ్ సెంటర్లలో మహిళా దినోత్సవం రోజున మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసే మహిళలకు 10 శాతం రాయితీ ఇవ్వాలని నిర్నయనించారు.
ప్రతి వింగ్ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం చేయాలనీ, పోలీసు డిపార్ట్‌మెంటులో పనిచేస్తున్న మహిళలందరికీ మహిళా దినోత్సవం రోజున స్పెషల్ డే ఆఫ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులందరికీ ఏటా హెల్త్ చెకప్ నిర్వహించాలని మహిళా ఉద్యోగులకు అదనంగా 5 క్యాజువల్ లీవ్స్ ఇచ్చేందుకు కూడా సీఎం జగన్ అంగీకరించారు. చేయూత కిరాణా దుకాణాల్లో అందుబాటులో శానిటరీ పాడ్స్ ఉంచనున్నారు. దీనికోసం సెర్ప్, మెప్మా మరియు హెచ్‌ఎల్‌ఎల్ మధ్య ఎంఓయూ కుదుర్చుకోనున్నారు.