దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిని నా అంత తోపు మరొకరు లేరు అని ఓ జబ్బలు చరుచుకుని 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఏపీలో దారుణంగా ఓడిపోయారు. దీంతో ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తుంటే రోజు రోజుకి దిగజారిపోతున్న పరిణామాలు కనబడుతున్నాయి.
ప్రస్తుతం అమరావతి రాజధాని విషయంలో ఆ ప్రాంత ప్రజలకు అనుగుణంగా ఆందోళనలు నిరసనలు చేస్తూ వైయస్ జగన్ సర్కార్ పై వ్యతిరేకత తీసుకురావాలని బాగా ట్రై చేస్తున్నా గాని జగన్ తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు జై కొడుతున్న తరుణంలో ఏం చేయలేని స్థితిలో డైలమాలో పడిపోయారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. అయితే ప్రపంచానికి పాఠాలు నేనే నేర్పాను హైదరాబాద్ నగరాన్ని నేనే కట్టించాను అంటూ తన గురించి తాను గొప్పలు చెప్పుకునే చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్విజర్లాండ్ రాజధానిలో దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనరు.
అయితే ఇటువంటి నేపథ్యంలో మళ్లీ ఈ ఏడాది దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సమావేశాలకు చంద్రబాబు వెళ్లే అవకాశం లేనట్టు ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంత భూముల విషయంలో స్కాం జరిగిందని జగన్ సర్కార్ అసెంబ్లీలో ఆరోపించడంతో ఒకవేళ విచారణ జరిగితే చంద్రబాబు విదేశాలకు వెళ్ళడానికి ఉండదు అని దీంతో దావోస్ లో జరగబోయే వేడుకలకు చంద్రబాబు వెళ్లే ఛాన్స్ ఈసారి ఉండదని..నిజంగానే విచారణ ఇప్పటికెప్పుడు స్టార్ట్ అయితే చంద్రబాబుకి వారం రోజులు పాటు నిద్రపట్టకపోవడం గ్యారెంటీ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.