గ్రామ వాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త..రూ.260 కోట్లతో… !

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ లో పని చేసే గ్రామ వాలంటీర్లకు జగన్‌ మోహన్ రెడ్డి సర్కార్‌ శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుంచి గ్రామ వాలంటీర్లకు అవార్డుల సన్మాన కార్యక్రమాలు చేపట్టనుంది ఏపీ సర్కార్‌. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగనుంది. కనీసం సంవత్సర కాలంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు 3 కేటగిరీల్లో పురస్కారాలు అందిస్తోంది ఏపీ సర్కార్‌.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,33,333 మంది వాలంటీర్లకు పురస్కారాలు అందించనుంది సర్కార్‌. పురస్కారాల రూపంలో 258.74 కోట్లు వ్యయం చేయనున్న ఏపీ ప్రభుత్వం… సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర క్యాటగిరిల్లో అవార్డులు ఇవ్వనుంది. సేవా వజ్ర పురష్కరం కింద రూ. 30 వేలు, సేవా రత్న కింద రూ.20 వేలు, సేవా మిత్ర కింద రూ. 10 వేలు నగదు పురస్కారం అందించనుంది ఏపీ సర్కార్‌. ఇక ఏపీ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం పై గ్రామ వాలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version