మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ కీలక లీడర్ జ్యోతిరాధిత్య సింధియా మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ కావడం దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. గత కొన్ని దశాబ్దాల నుండి జ్యోతిరాధిత్య సింధియా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా పని చేసింది. తాజా పరిణామంతో కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ లో కూడా క్లోజ్ అయిపోయినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు 116 సీట్లున్నాయి. అలాగే బిజెపికి 106 సీట్లున్నాయి. మరో ఎనిమిది మంది ఇతరులున్నారు. నిజానికి ఏడాది క్రిందట మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జ్యోతిరాధిత్యనే సిఎం అవుతారని అనుకున్నారు.
రాహుల్ గాంధీ ఎంతో సన్నిహితంగా ఉండే సింధియా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాణించారు. అయితే పార్టీ కోసం చేసిన కృషి పార్టీలో ఉన్న సీనియర్లు గుర్తించకుండా పార్టీలో గ్రూపు రాజకీయాలు స్టార్ట్ చేయటంతో సింధియా…బీజేపీ లోకి వెళ్ళడానికి రెడీ అయినట్లే అనే బలమైన టాక్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో వినబడుతోంది. కాగా ప్రస్తుతం ఈ న్యూస్ దేశ స్థాయిలో చర్చనీయాంశంగా మారడం తో జగన్ మధ్యప్రదేశ్ లో జరిగేది ముందే ఎప్పుడో గెస్ చేసి తన సన్నిహితుల దగ్గర ఈ మాట ఎప్పుడో చెప్పాడు అని టాక్. అంతేకాకుండా ఆ మధ్య డిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర మంత్రి ఒకరు ఈ విషయం జగన్ దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం.