టీడీపీ ఊహకు అందని ప్లాన్ వేసిన జగన్…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కేంద్రం అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది కొందరి మాట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఏ చిన్న ప్రచారం వచ్చినా సరే తెలుగుదేశం మాత్రం అనేక రకాలుగా సంబరాలు చేసుకుంటూ ఉంటుంది. అసలు విషయం ఏంటో తెలియకపోయినా టీడీపీ నేతలు ఒక రేంజ్ లో హడావుడి చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా కూడా అలాగే ఉంది.

ఇప్పుడు రాజ్యసభ సీట్లలో ఒక సీటు ని పరిమల్ నత్వానికి జగన్ ఇచ్చారు. ముఖేష్ అంబాని వచ్చి జగన్ ని కలవగానే టీడీపీ కాస్త అతి ప్రచారం చేసింది. కేంద్రం చెప్పింది కాబట్టి జగన్ ఇవ్వాలి, లేకపోతే జగన్ ని అరెస్ట్ చేస్తారు, గతంలో తన తండ్రిని రిలయన్స్ చంపించింది అనే అనుమానం జగన్ కి ఉంది కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చే సూచనలు లేవు అని టీడీపీ అంది. రెండు స్థానాలు జగన్, ఎన్డియేకి ఇస్తారని భావించారు.

టీడీపీ అంచనా వేసినట్టే నత్వానికి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చేసారు. ఆయన వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళడం అనేది ఖరారు అయిపోయింది. ఇక్కడ జగన్ వ్యూహమే టీడీపీ ని ఇబ్బంది పెడుతుంది. వాస్తవానికి కొన్ని నిర్ణయాలు కేంద్రం తప్పుబడుతూ జగన్ మీద ఆగ్రహంగా ఉంది. ఈ తరుణంలో జగన్ అంబాని సూచించిన వ్యక్తికి సీటు ఇచ్చారు, అదే డైరెక్ట్ గా ఏ బిజెపి నేతకో ఇచ్చి ఉంటే ఎన్డియే తో జగన్ లోపాయకారి ఒప్పందం అనే వాళ్ళు.

ఇప్పుడు జగన్ ని ఈ విషయంలో నేరుగా విమర్శించలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీది. దీనితో జగన్ కేంద్రానికి మరింత దగ్గరయ్యారు. రాజ్యసభలో ప్రతీ సీటు కూడా బిజెపికి కీలకం కాబట్టి ఆ విధంగా చెయ్యాల్సిన సాయం జగన్ చేసారు. దీనితో బిజెపి, జగన్ మధ్య మంచి వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు టీడీపీ రాజకీయంగా బిజెపికి చేసే సహాయం ఏమీ లేదు కాబట్టి, చంద్రబాబు అవసరం బిజెపికి లేదు. కాబట్టి జగన్ రాజ్యసభ సీటు తో కేంద్రానికి మరింత దగ్గరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version