ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బిసిఎ సమావేశంలో పలు కీలక విషయాలు చోటు చేసుకున్నాయి. సమావేశానికి హాజరయిన అచ్చెన్నాయుడు ను చూసి ద గ్రేట్ అచ్చెన్నాయుడు అంటూ సిఎం జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక చర్చ పై అచ్చెన్నాయుడు, మంత్రులు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అసెంబ్లీ 10 రోజులు నడపాల్సిందే అని అచ్చెన్న పేర్కొన్నారు. కరోనా పెరుగుతుంది, అసెంబ్లీలో 70 ఏళ్లు, 60 ఏళ్లు పైబడినవారు ఉన్నారు, అందుకోసం ఐదు రోజులకు తగ్గించామని మంత్రులు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో వైసిపి ర్యాలీలు పెట్టినప్పుడు మీకు వయస్సు, ప్రజల ఆరోగ్యం గుర్తుకురాలేదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
అయితేకరోనా కారణంగా అధికారులు భయపడుతున్నారన్న సిఎం అందుకే గుర్తించామని పేర్కొన్నారు. వరదలు, పంట నష్టం, రైతుల పరిస్థితిపై చర్చించాల్సిందేననీ అచ్చెన్నాయుడు పట్టుబట్టారు. మీరు అడిగారనే చర్చ పెడుతున్నామని అధికారపక్షం పేర్కొంది. అరగంట ఆలస్యంగా సభ ప్రారంభించడం ఏమిటని అచ్చెన్నాయుడు ప్రశ్నించడంతో మీరు ధర్నాలు, ప్రదర్శనలు చేస్తున్నారు కదా..? రావడం ఆలస్యం అవుతుందని లేట్ గా ప్రారంభించామని చమత్కరించారు మంత్రులు.