చేనేత కార్మికుల కుటుంబలకు రూ.24000 : జగన్ మోహన్ రెడ్డి

-

జాతీయ చేనేత దినోత్సవం ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి మీడియా వేదికగా నేతన్న హస్తం గురించి ప్రస్తావించారు. దేశంలో చేనేత రంగంలో ముందుకు వెళ్తున్న రెండు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు సంవత్సరానికి 24 వేల రూపాయలు ఆర్థిక సాయం గా అందిస్తున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కరోనా కష్ట సమయంలో కూడా ఈ సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు.

jagan

ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు.నేత కార్మికులందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత కుటుంబాలకు 24 వేలు ఇస్తామని చెప్పి కేవలం 80 వేల కుటుంబాలకే ఇస్తే మిగిలిన లక్షల కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు మూడు నెలల కాలానికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలన్నారు. నూలుపై సబ్సిడీ, పావలా వడ్డీ, త్రిఫ్ట్‌ ఫండ్‌ బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని సూచించారు. నేతన్నల దగ్గరున్న సరకును కొనుగోలు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version