రాజధాని అమరావతి భూముల గురించి మూడు రాజధానులు గురించి అమరావతి ప్రాంత రైతులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిరసనలు చేపడుతూనే ఉన్నారు. ఇటువంటి సమయంలో రాబోయే ఉగాది పండుగ నాడు దాదాపు 50 వేల మందికి పైగానే పేదవాళ్లకు అమరావతి రాజధాని ప్రాంతం భూములను ఇళ్ల స్థలాలుగా ఇవ్వటానికి జగన్ సర్కార్ రెడీ అయింది.
కేవలం రాజధాని ప్రాంతంలో ఉన్నపేదలకు మాత్రమే కాకుండా గుంటూరు మరియు కృష్ణా జిల్లాలో ఉన్న పేదలకు కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఇళ్లస్థలాలు ఇవ్వటానికి జగన్ సర్కార్ రెడీ అవటంతో ఈ విషయంలో టిడిపి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని వేసిన స్కెచ్ కి జగన్ వేసిన స్కెచ్ ఫర్ ఫెక్ట్ గా వర్క్ ఔట్ అయినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.
విషయంలోకి వెళితే తిపక్షాలు ఇలా కోర్టును ఆశ్రయిస్తాయనే ఊహతో, ముందుజాగ్రత్తగానే ప్రభుత్వం జీవోను సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. భూ సమీకరణలో తీసుకున్న మొత్తం భూమిలో కనీసం 5 శాతం భూమిని పేదలకు గృహనిర్మాణం కోసం అందుబాటులో ధరలో కేటాయించాలని సిఆర్డిఏ చట్టంలో ఉన్న 53 (డి) నిబంధన ఆధారంగా ఈ కేటాయింపు ఉత్తర్వులు ఇస్తున్నట్లుగా జీవోలో పేర్కొన్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో రూపొందించిన సీఆర్డీయేచట్టం నిబంధనలనే కోట్ చేస్తూ జీవో రావడం. దీంతో లీగల్ గా ఏ ఒక్కరూ ఇప్పుడు ప్రశ్నించే పరిస్థితి లేకుండా జగన్ ముందు జాగ్రత్తగా చాలా తెలివిగా వ్యవహరించటం జరిగింది.