కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌.. ఆ దేశాలకు వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక..!

-

కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలా వ్యాప్తి చెందుతుందో అందరికీ తెలిసిందే. ఒక్క చైనాలోనే ఈ వైరస్‌ ప్రభావం వల్ల ఇప్పటికే 2600 మంది మృతి చెందారు. ఇక కొత్తగా మరిన్ని కేసులు బయట పడుతున్నాయి. అయితే కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం పలు దేశాలకు వెళ్లే వారికి హెచ్చరికలు జారీ చేసింది.

[tps_footer][/tps_footer]

భారత్‌ నుంచి చైనా, దక్షిణ కొరియా, ఇరాన్‌, ఐటలీ దేశాలకు వెళ్లేవారు తమ ప్రయాణాన్ని మానుకుంటే మంచిదని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది. ఆయా దేశాలలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఆ దేశాల నుంచి వచ్చే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతామని ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కరోనా వైరస్‌ ప్రభావం వల్లే పైన తెలిపిన దేశాలకు వెళ్లకూడదని ప్రయాణికులను హెచ్చరిస్తున్నట్లు కేంద్రం తెలపగా, ఈ విషయంపై మరిన్ని వివరాల కోసం +91-11-23978046 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించవచ్చని లేదా ncov2019@gmail.com కు మెయిల్‌ పంపవచ్చని అధికారులు తెలిపారు. రోజులో 24 గంటలూ ప్రయాణికులకు సదరు ఫోన్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం అందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version