జ‌ర్న‌లిస్ట్ ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ షాక్.. ఆ రాయితీ క‌ట్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని జ‌ర్న‌లిస్ట్ ల‌కు వైసీపీ ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర్న‌లిస్ట్ ల పిల్ల‌లకు స్కూల్ ఫీజ్ లో రాయితీలు ఉండేవి. వాటిని తాజా గా జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌ట్ చేసింది. ఆంధ్ర ప్ర‌దేశ్ లో జ‌ర్న‌లిస్ట్ పిల్ల‌లంద‌రికీ స్కూల్ ఫీజ్ ల‌లో 50 శాతం రాయితీ ఉండాల‌ని గతంలో చంద్ర‌బాబు స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుని అమ‌లు ప‌రిచింది. కానీ నేడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం జ‌ర్న‌లిస్ట్ ల‌కు షాక్ ఇస్తు ఈ నిర్ణ‌యం తీసుకుంది. కాగ త‌మ పిల్లల ఫీజులు రాయితీ అవ‌డం లేద‌ని రాష్ట్రంలో అన్ని జిల్లాలో జ‌ర్న‌లిస్ట్ లు డీఈవో ల‌కు విన్న‌వించారు.

దీంతో రాష్ట్రంలో డీఈవోలు అంద‌రూ రాష్ట్ర విద్య శాఖ డైరెక్ట‌ర్ కు జ‌ర్న‌లిస్ట్ ల విన‌తి ప‌త్రాల పై నివేధిక అందించారు. అయితే విద్య శాఖ డైరెక్ట‌ర్ నుంచి వ‌చ్చిన ఆదేశాలు జ‌ర్న‌లిస్ట్ ల‌కు షాక్ కు గురి చేశాయి. జ‌ర్న‌లిస్ట్ పిల్లలకు స్కూల్ ఫీజ్ లో రాయితీ ని అమ‌లు చేయ‌వ‌ద్ద‌ని విద్య శాఖ డైరెక్ట‌ర్ అన్ని జిల్లాల డీఈవో ల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇది రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణ‌యం అని.. డీఈవో లు దీని పై ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోవద్ద‌ని తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తం గా జ‌ర్న‌లిస్ట్ లు ఆందోళ‌న బాట ప‌ట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version