ఓమిక్రాన్ పై అప్రమత్తం అవుతున్న తెలంగాణ సర్కార్..

-

దేశంలో ఓమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 150 దాటింది. తెలంగాణలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతోంది. ఇప్పటికే పలుమార్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, వైద్య అధికారులతో సమావేశం అయ్యారు. ఓమిక్రాన్, థర్డ్ వేవ్ ముప్పుపై చర్చించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సమీక్షించారు. మరోవైపు వ్యాక్సిన్ వేగాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

మరోవైపు జనవరిలో కేసులు పెరుగుతాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లను కూడా ఏర్పాటు చేశారు. పీపీఈ కిట్లను, మెడిసిన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఇప్పటికే సెలవుల్లో ఉన్న వైద్య సిబ్బందికి సెలవును రద్దు చేసింది. సెలవులపై వెళ్లిన వారిని వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సంక్రాంతి తరువాత కేసులు పెరుగుతాయని వైద్యశాఖ అంచనా వేస్తోంది. రానున్న నెల రోజులు కీలకమని భావివస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version