బాలయ్యతో సెల్ఫీపై జగన్ ఆగ్రహం…!

-

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రాజధాని బిల్లు విషయంలో క్షణ క్షణం ఎం జరుగుతుందో ఆనే ఆసక్తి మంగళ బుధవారాల్లో నెలకొన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు బిల్లు సెలెక్ట్ కమిటికి పంపిస్తూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. దీనితో రాజధాని బిల్లు ఆమోదం పొందడానికి మూడు నుంచి నాలుగు నెలల వరకు పట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి గ్యాలరీలో ఒక దృశ్యం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు సందర్భంగా మండలి సమావేశాలను వీక్షించేందుకు చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ మండలి విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్నారు. కాసేటికి ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, దెందులూరు ఎమ్మెల్యే,

అబ్బయ్య చౌదరి సహా పలువురు అక్కడికి వచ్చారు. వీరందరూ బాలకృష్ణ తో కలిసి సేల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తరుతంగా వైరల్ అవుతున్నాయి. దాదాపు పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆయన చుట్టూ చేరి సెల్ఫీలు దిగ్గారు. దీనిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఒక పక్క బిల్లు ఆమోదం పొందక అవమానంగా ఉంటే మీరు ఏ విధంగా ఫోటోలకు ఫోజులు ఇస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version