వీర జవాన్ సుబ్బయ్యకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తాజాగా నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు చేశారు. రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్. జమ్మూలో విధి నిర్వహణలో సుబ్బయ్య వీరమరణం చెందారు.
జమ్మూలో ల్యాండ్ మైన్ నుంచి 30 మంది జవాన్లను కాపాడి తాను మాత్రం ప్రాణాలను కోల్పోవడం బాధకరం. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నా” అని వైఎస్ జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.