ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను తాజాగా విద్యాశాక మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లీషు, 24న మ్యాథ్య్స్, 26న ఫిజిక్స్, 28న బయోలజీ, 31న సోషల్ పరీక్షలు జరుగనున్నాయి.
విద్యార్థులు చదివేందుకు వీలైనంత సమయం తీసుకొని మంచి మార్కులు సాధించాలని సూచించారు. విద్యార్థులు ఇప్పటి నుంచే ఒక టైమ్ టేబుల్ ఏర్పాటు చేసుకొని పరీక్షలకు సన్నద్ధం కావాలని.. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. పదో తరగతి మార్కులు చాలా కీలకమని మంత్రి లోకేష్ తెలిపారు.