ఉద్యోగాల క‌ల్ప‌న‌లో కేసీఆర్ హిట్.. జ‌గ‌న్ ఫ‌ట్

-

ఎన్నో పోరాటాల మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి…. ఏదో ఒక రూపంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కొనసాగుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు… తగ్గేదే లే అన్నట్లుగానే రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. రెండుసార్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్… నీళ్లు, నియామకాలు, నిధులు అన్న దోరనీతోనే ముందుకు సాగుతున్నారు. రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరిగిందంటే… ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు సీఎం కేసీఆర్. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు… ప్రాజెక్టుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు సీఎం కేసీఆర్. చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేస్తూ… తెలంగాణకు వచ్చే వాటాను తెచ్చుకున్నారు.

అయితే ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి సీను పూర్తిగా మారిపోయింది. రెండు రాష్ట్రాలు, అలాగే ముఖ్యమంత్రులు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. కానీ…ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏపీ రాజకీయాలను డామినేట్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు తెచ్చినా… కీలక నిర్ణయాలు తీసుకున్నా… రోల్ మోడల్ గా కెసిఆర్ నిలుస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హీరో అయి పోతున్నారు సీఎం కేసీఆర్. అంతేకాదు సీఎం కేసీఆర్ కు ఏపీలో ఫ్లెక్సీలు, పార్లే అభిషేకాలు చేస్తున్నారు. ఏపీ రాజకీయ నాయకులకు లేని ఫాలోయింగ్ కేసీఆర్కు అక్కడ ఉంది. దీనికి సీఎం కేసీఆర్ మార్క్ పాలనే కారణం.

అయితే నిన్న సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఉద్యోగాల ప్రకటన చేయడంతో… ఏపీలో ఆయనకున్న ఫాలోయింగ్ మరింత పెరిగింది. తెలంగాణ నిరుద్యోగులతో పాటు ఏపీలోనూ నిరుద్యోగులు కెసిఆర్ నిర్ణయానికి ఫిదా అయిపోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి జగన్ నేర్చుకోవాలి అంటూ… నిరుద్యోగుల నుంచి ప్రతిపక్ష నాయకులు కూడా చురకలు అంటిస్తూ ఉన్నారు. అయితే ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ హిట్ అయ్యారా ? లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిట్ అయ్యారా ? అనేదానిపై సోషల్ మీడియాలో పోలింగ్ నిర్వహించగా… దాదాపు 90 శాతం మంది సీఎం కేసీఆర్ కే ఓటు వేశారు. కేవలం 11 శాతం మాత్రమే సీఎం జగన్ కు ఓటు వేశారు. ఈ లెక్కన… సీఎం జగన్ కంటే… కేసీఆర్ కే నిరుద్యోగుల లో ఫాలోయింగ్ ఉంది అన్నమాట. నిరుద్యోగ బంధుగా కెసిఆర్ నిలుస్తున్నారని మనకు అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version