అదేంటి జగన్ వర్సెస్ చంద్రబాబు కదా మెయిన్…మరి జగన్ వర్సెస్ పవన్ ఏంటి? అసలు జగన్ ఇప్పటికే పైచేయి సాధించి ఉన్నారు…మరి అలాంటప్పుడు..మళ్ళీ కొత్త వార్ ఏంటి అని డౌట్ రావొచ్చు. రాష్ట్రంలో వాస్తవ పరిస్తితులని గమినిస్తే చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లే నడుస్తున్నాయి. టీడీపీ-వైసీపీల మధ్యే మెయిన్ ఫైట్ నడుస్తోంది. కానీ ఈ ఫైట్ లో పవన్ కల్యాణ్ కీలకం కానున్నారు…ఆయన వల్లే జగన్ కు రిస్క్ ఎక్కువ ఉంది…ఒకవేళ పవన్ గాని…బాబుతో కలిస్తే జగన్ కు గెలుపు అవకాశాలు తగ్గుతాయి. ఈ విషయం గతంలోనే రుజువైంది.
అయితే వచ్చే ఎన్నికల్లో పవన్ గాని…బాబుతో జట్టు కడితే జగన్ కు ఇబ్బంది. గత ఎన్నికల్లో వీరు కలిసి ఉంటే వైసీపీకి గట్టి పోటీ వచ్చేది…అయినా సరే జగన్ వేవ్ వల్ల వైసీపీకే అధికారం దక్కేది. కానీ ఈ సారి జగన్ వేవ్ తక్కువగా ఉంది..ఇలాంటి సమయంలో టీడీపే-జనసేన కలిసొస్తే వైసీపీకి గెలుపు కష్టం. అందుకే ఈ మధ్య జగన్ సైతం పవన్ ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు.