విద్యుత్ రంగాన్ని నాశనం చేసిన జగన్.. కొత్తగా ధర్నాలు చేస్తారా? : టీడీపీ ట్వీట్

-

ఐదేళ్ల అరాచక పాలనలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన మాజీ సీఎం జగన్.. కూటమి ప్రభత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోనే విద్యుత్ రంగం కోసం ధర్నాకు పిలుపునివ్వడంపై జనం నవ్వుకుంటున్నారని శుక్రవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా ట్వీట్ చేసింది.

గత ఐదేళ్ల పాలనలో అక్రమ విద్యుత్ కొనుగొళ్లు, కక్ష సాధింపుతో పీఏఏల రద్దు, ఏపీ జెన్కోలో విద్యుదుత్పత్తి తగ్గుదల, కరెంటు కోతలు, ట్రాన్స్ ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లలో అవినీతి, బొగ్గు కొనుగోళ్లలో అవినీతి, ట్రూ అప్ చార్జీలు అంటూ కొత్త రకం బాదుడు, ఇలా 9 సార్లు చార్జీలు పెంచిన మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలా ధర్నాలు చేస్తారని టీడీపీ పార్టీ ట్వీట్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news