కామారెడ్డి ఎస్సై, కానిస్టేబుల్, ఆపరేటర్ మృతిలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కామారెడ్డిలో భిక్కనురు ఎస్.ఐ. సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతి కేసు…మిస్టరీగా మారింది. ఈ ఎస్.ఐ. సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతి కేసులో ముగ్గురి కాల్ డేటా, వాట్స్ అప్ చాటింగ్..కీలకంగా మారింది.
వారం రోజులుగా ముగ్గురు గంటల తరబడి ఫోన్లు మాట్లాడుకుని, వాట్స్ అప్ చాటింగ్ చేసుకున్నారని గుర్తించారు పోలీసులు. కామారెడ్డిలో భిక్కనురు ఎస్.ఐ. సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతి కేసు విచారణ కు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. ముగ్గురు కలిసి ఒకే కారులో ఆడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువుకు వచ్చినట్లు గుర్తించారు. దర్యాప్తులో పోస్ట్ మార్టం నివేదిక,,,కీలకం కానుంది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.