చిరు వ్యాపారులకు జగనన్న తోడు ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు నిధులను విడుదల చేశారు సీఎం జగన్. జగనన్న తోడు పథకంలో భాగంగా… లబ్ది దారుల ఖతాల్లో రూ. 16.36 కోట్ల వడ్డీ జమ చేశారు సీఎం జగన్. ఇక పథకం ద్వారా ఏకంగా 450546 మంది చిరు వ్యాపారలు లబ్ది పొందనున్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… చిరు వ్యాపారుల కష్టాలను పాదయాత్రలో తెలుసుకున్నానని… అందుకే చిరు వ్యాపారుల కోసం జగన్న తోడు పథకాన్ని ప్రారంభించామని వెల్లడించారు. చిరు వ్యాపారులకు అండగా జగనన్న తోడు పథకం ఉంటుందని.. చిరు వ్యాపారులకు బ్యాంకుల నుంచి ఎప్పుడూ సహకారం అందలేదన్నారు.
గత ప్రభుత్వాలు కూడా చిరు వ్యాపారులను పట్టించుకోలేదని చెప్పారు సీఎం జగన్. గత్యంతరం లేని పరిస్తితుల్లో చిరు వ్యాపారులను వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవాళ్లని వెల్లడించారు సీఎం జగన్. నిరుపేదలైన చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10,000 వడ్డీలేని రుణం అందించింది.