కరోనా కట్టడికి జగన్‌ కీలక నిర్ణయం..నేడు ఆక్సిజన్‌ ప్లాంట్ల ప్రారంభం

-

కరోనా కట్టడికి సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే…ఒంగోలు రిమ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటును వర్చువల్ లో ఇవాళ ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా సర్వీసు క్రమబద్దీకరించాలంటూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకానున్న సచివాలయ ఉద్యోగులు.. ఒమిక్రాన్ నేపథ్యంలో ఇవాళ్టి నుండి ఫ్రంట్ లైన్ వర్కర్లు, అరవై ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ టీకాలు వేయనున్నారు ఆరోగ్య శాఖ అధికారులు.

jagan

జిల్లాలోని విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం జరుగనుంది. పర్చూరులో సంక్రాంతి సందర్భంగా దక్షిణ భారత దేశస్థాయి క్రికెట్ పోటీలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి కూడా సీఎం జగన్‌ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే.. వలేటివారిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్సులతో కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం జగన్‌ పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version