ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవీకి జగన్ మోహన్ రెడ్డి తాజాగా రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ కి పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో రాజీనామా చేశారు. రాజీనామా కు ముందు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు సీఎం జగన్. వైసీపీకి ఇలా తక్కువ సీట్లు వస్తాయని ఊహించలేదు. ఈ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరిచాయని వ్యక్తం చేశారు.
ఏపీ ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రయ పడ్డామని బాధతో చెప్పారు. అరకోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. అమ్మఒడి కోటి 53 లక్షల మందికి మంచి చేశాం. ఎప్పుడూ జరగని విధంగా పిల్లల చదువులు క్వాలిటీ చదువులను తీసుకొచ్చామని గుర్తు చేశారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చాం. ప్రతీ ఇంటికి సేవలు అందించేలా.. కరెప్షన్ లేకుండా ఇంటివద్దకే పాలన తీసుకొచ్చాం. ఎప్పుడూ చూడని మార్పును తీసుకొచ్చాం. కానీ ప్రజల నిర్ణయమే తుది నిర్ణయం అన్నారు. సీఎం జగన్ రాజీనామాతో గవర్నర్ ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.