ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వి.విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభుల పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. ఆ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది.శాసన సభలో పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే నాలుగు రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి చేరడం ఖాయంగా కన్పిస్తోంది.
టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదు. నాలుగు స్థానాలూ వైఎస్సార్‌సీపీ గెల్చుకుంటుంది.ప్రస్తుతంఉన్న YSRCP సభ్యుల్లో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీకి చెందిన సీఎం రమేష్‌ల పదవీకాలం 2024 ఏప్రిల్ 22తో ముగుస్తుంది.
ఈ 3స్థానాలకు 2024 ఎన్నికలకుముందు ఎన్నికలు జరుగుతాయి.శాసనసభలో సంఖ్యాబలం ఆధారంగా ఆ 3 స్థానాలు YSRCP దక్కించుకోనుంది. అమరావతి: రాజ్యసభలో రాష్ట్ర కోటా 11 స్థానాలు. ప్రస్తుతం ఐదుగురు YSRCP సభ్యులున్నారు . జూన్ 10న పోలింగ్ జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలు YSRCP ఖాతాలోకి చేరతాయి. అప్పుడు వైఎస్సార్‌సీపీ బలం 5 నుంచి 9కి పెరుగుతుంది. అయితే.. ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఆదానీ కుటుంబంలోని ఒకరికి సీటు ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారట. అయితే.. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.