గుంటూరు కారం ని ఎంజాయ్ చేయలేకపోయా: జగపతి బాబు

-

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీని ఎంజాయ్ చేయలేకపోయాను అని నటుడు జగపతిబాబు అన్నారు. సినిమాలోని కొన్ని పాత్రలో మార్పులు చేస్తే బాగుండేదని క్యారెక్టర్జేషన్ ఎక్కువగా ఉండడం వలన గందరగోళం ఏర్పడిందని చెప్పారు. తన పాత్ర కోసం చేయాల్సిందంతా చేశానని జగపతిబాబు చెప్పారు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో గుంటూరు కరం గత జనవరిలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది గుంటూరు కారంలో జగపతిబాబు కూడా నటించారు ఆయన తాజాగా ఈ మూవీ గురించి స్పందించారు నేను ఎప్పుడు మహేష్ బాబుతో కలిసి పని చేయడానికి ఇష్టపడతాను. నిజం చెప్పాలంటే గుంటూరు కారం ని ఎంజాయ్ చేయలేకపోయాను కొన్ని పాత్రలో మార్పులు చేస్తే బాగుండేది క్యారెక్టరైజేషన్ కూడా ఎక్కువ ఉండడంతో గందరగోళం ఏర్పడిందని జగపతిబాబు అన్నారు మహేష్ బాబు నా కాంబినేషన్ ని వృధా చేయకూడదని అనుకున్నాను ఈ కాంబో ఉత్తమంగా ఉండాలి ఆయనతో చేసిన మూవీ ఎప్పటికీ గుర్తుండి పోవాలి అనుకుంటాను అని జగపతిబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news