వీడు ఎక్కడికి పోతాడులే అని ఒక సినిమా షూటింగ్లో వారం రోజులు భోజనం పెట్టలేదు.. జగపతి బాబు

-

టాలీవుడ్ హీరో జగతిబాబు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. హీరోగా వందల సినిమాల్లో నటించినా ఒకానొక పరిస్థితిలో ఆర్థికంగా నష్టపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా కెరియర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం నిలదొక్కుకున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జగపతిబాబు తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు..హీరో జగపతిబాబు తండ్రి స్టార్ ప్రొడ్యూసర్. వివబీ రాజేంద్రప్రసాద్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు సంపాదించుకొని నిర్మాతగా నిలదొక్కుకున్నారు. ఆయన కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జగపతిబాబు హీరోగా ఎన్నో అవకాశాలు అందుకొని వందల సినిమాల్లో నటించారు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా మారి సక్సెస్ అయ్యారు. అయితే ఒకానొక సందర్భంలో అతన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి..

ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని అప్పుల పాలయ్యారు. జీవితంలో ఏమీ తోచలేని పరిస్థితిలో మళ్లీ విలన్ గా కెరియర్ను స్టార్ట్ చేసి నిలదొక్కుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన.. “నాకు తెలిసిందే సినిమానే. 35 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నాను. సాహసం అనే మూవీలో సెట్స్ లో నాకు జరిగిన అవమానం ఎప్పటికీ గుర్తిండిపోతుంది. వారం రోజులు నాకు అన్నం పెట్టలేదు. కనీసం తింటావా అని అడగలేదు. ఆ మూవీకి పని చేసిన లైట్ బాయ్ కూడా నా వద్దకు వచ్చి ఏడ్చాడు. వీడు ఎక్కడిపోతాడులే సినిమాల్లోనే నటిస్తాడని అవమానించేవారు. ఇతర భాషల్లో నటించి వస్తే మనోళ్లు గౌరవం ఇస్తారు… ఫ్యామిలీ విషయానికి వస్తే నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి అమెరికన్ ని వివాహం చేసుకుంది. చిన్నమ్మాయికి మ్యారేజ్ వద్దన్నాను. కావాలంటే నువ్వే వెతికి చేసుకో అన్నాను. పార్ట్నర్ ఎంచుకునే విషయంలో వాళ్ళ మనం నియంత్రించకూడదు… నాకైతే భార్య పెళ్లి వంటి రిలేషన్స్ పైన పెద్దగా నమ్మకం లేదు..” అంటూ చెప్పుకొచ్చారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version