ఫ్యామిలి హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో ” జగపతి బాబు “. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న జగపతి బాబు… లెజెండ్ సినిమాతో తనలోని విలనిజాన్ని బయటపెట్టారు. ఇక అప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతూ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే.. తాజాగా అభిమాన సంఘాలకు, ట్రస్టుకు గుడ్ బై చెప్పాడు జగపతిబాబు.

ప్రముఖ నటుడు జగపతి బాబు సోషల్ మీడియా లో ఓ పోస్టు చేశారు. ఇక నుంచి తనకు, తన అభిమాన సంఘాలకు ఎలాంటి సంబంధం లేదని అందులో రాసుకొచ్చారు. అయితే, తనని ప్రేమించే అభిమానులకి ఎప్పుడూ తోడుగా ఉంటానని అన్నారు. 33ఏళ్లుగా తనకు తోడుగా నిలిచిన వారందరికీ తానూ నీడగా ఉన్నానన్నారు. కానీ, చాలా మంది తన నుంచి ఆశించడం ఎక్కువైపోయిందని, ఎంతలా అంటే తనని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందని జగ్గూభాయ్ చెప్పారు.